TG: మాజీ సీఎం KCRపై సీఎం రేవంత్ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఫామ్‌హౌస్‌లో ఎకరం పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని చెప్పిన ఆయన, ఆ విద్యను యువతకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అలాగే, రూ.3 కోట్లకు గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చామని గత పాలకులు తమపై చేసిన తప్పుడు ఆరోపణలు, కష్టపడి చదివిన పేద విద్యార్థులను అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.