ELR: కలెక్టర్ వెట్రిసెల్వి ఇవాళ పెదవేగిలో పర్యటించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నడిపల్లి గ్రామం కొత్తూరు కాలనీ వద్ద మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగానికి, కాలినడకకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.