అన్నమయ్య: పి సుండుపల్లి మండలానికి చెందిన రాజేష్, చంద్రగిరి మండలానికి చెందిన నవ్య శ్రీ బీటెక్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. చదువు పూర్తయిన అనంతరం బెంగళూరులో ఉద్యోగం సంపాదించారు. వారిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు కుటుంబాల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని వారు కోరారు.