కృష్ణా: స్వచ్ఛమైన గాలితో మనం ఆరోగ్యకరంగా జీవన ప్రయాణం కొనసాగించ వచ్చని ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు వేస్తూ కాలుష్య కట్టడికి సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఈ మేరకు అక్టోబర్ నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరువూరు మండలం, లక్ష్మీపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.