KDP: సిద్ధవటం మండలం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పద్మశాలి వర్గానికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని టీడీపీ నేత శ్రీనివాసులు మండిపడ్డారు. మాధవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ వర్గానికి చెందిన పద్మశాలీలు నిబద్ధతతో సేవలందిస్తున్నా సభా వేదికపైకి పిలవనివ్వకపోవడం బాధాకరమన్నారు.