JGL: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి శనివారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు, జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ జై కుమార్కు దరఖాస్తును అందజేశారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి తదితరులను ఆయన సన్మానించారు.