BDK: భద్రాచలం కేజీబీవీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్(2), స్వీపర్(2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈనెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అప్లికేషన్లు అందజేయాలన్నారు. 7వ తరగతి పాసై 45 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు అర్హులని చెప్పారు. అప్లికేషన్ తో పాటు 7వ తరగతి స్టడీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వాలని సూచించారు.