కోనసీమ: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడిటర్ కర్రి పూర్ణ రెడ్డి ఆధ్వర్యంలో వెలువడబోతున్న అవినీతికి వ్యతిరేకి నూతన తెలుగు దినపత్రికను శనివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆయన వాడపాలెంలో ఆవిష్కరించారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఎడిటర్ కె. పూర్ణారెడ్డిని అభినందించి ప్రజా సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు.