GNTR: తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో అలింకో సంస్థ వారిచే ఎంపిక కాబడిన దివ్యాంగులకు ఆసరా పరికరాలు శనివారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అందచేశారు. అనంతరం సీఎం పర్యటన సందర్భంగా P4లో గుర్తింపబడిన పొన్నేకల్లు గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు వారి ఉపాధికి అవసరమైన పరికరాలను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అందజేశారు.