E.G: కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గుత్తుల దుర్గారావు అనారోగ్యంతో ఇంటి వద్దనే వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శనివారం దుర్గారావు కుటుంబాన్ని పరామర్శించి వైద్యం ఖర్చులకోసం రూ. 10,000లు, ఇంటిలో పోషణ కోసం 25 కేజీలు రైస్ ప్యాకెట్‌ను అందించడం జరిగింది.