TPT: నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన దాదాపు 26 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాబి తెలిపారు. పోలీసులు వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 26 మందికి రూ.2,60,000 జరిమానా విధించినట్లు సీఐ వివరించారు. అనంతరం జరిమానా కట్టిన వాహనదారులు మళ్లీ పట్టుబడితే జైలు శిక్ష తప్పదని తెలిపారు.