TPT: ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు నగలు దొంగిలించే ముగ్గురు మహిళా దొంగలను, ఇద్దరు మోటార్ సైకిల్ దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువచేసే 230 గ్రాముల బంగారు నగలు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీలు నాగభూషణరావు, రవి మనోహర్ ఆచారి వివరాలను మీడియాకు వెల్లడించారు.