TG: ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని పోరాడిన యువత ఆశలు గత పదేళ్లలో నెరవేరలేదని Dy CM భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత పాలకులు యువత ఆశల గురించి ఆలోచించలేదు. మా ప్రభుత్వం యువత ఆశలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చాం, ఇవాళ గ్రూప్-2 ఉద్యోగాలు ఇస్తున్నాం, త్వరలో మరిన్ని ఉద్యోగ నియామకాలు ఉంటాయి’ అని చెప్పారు.