TG: నూతన గ్రూప్-2 ఉద్యోగులకు సీఎం రేవంత్ కీలక సూచన చేశారు. ఉద్యోగం, పెళ్లి తర్వాత కొందరు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆదేశించారు. లేదంటే, వారి జీతం నుంచి కొంత మొత్తం కోత విధించి, నేరుగా తల్లిదండ్రులకు ఇచ్చేలా త్వరలోనే చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు.