HYD: బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని కౌశిక్ సొసైటీలో జలమండలి ఆస్తిని దెబ్బతీసిన కాంట్రాక్టర్ మహ్మద్ ఇమ్రాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ అనుమతి లేకుండా రోడ్డును తవ్వడంతో వాటర్ పైప్ లైన్ దెబ్బతిని, స్థానికులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. జలమండలి అధికారులు వెంటనే స్పందించి, ఘటనా స్థలాన్ని పరిశీలించి కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు.