BDK: అన్నపురెడ్డిపల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. మండలంలోని ప్రజానీకానికి పారదర్శకంగా సేవలు అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు.