VSP: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం విశాఖలోని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని పర్యాటక ప్రదేశాలలో సాయంత్రం 4 గంటల తర్వాత సాధారణ ప్రజలకు ప్రవేశం పూర్తిగా నిషేధించినట్టు సంస్థ అధికారులు శనివారం తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా, కైలాసగిరి, టీయూ-142 విమాన మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం, సీ-హారియర్ మూసివేస్తున్నామన్నారు.