TG: హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన గ్రూప్-2 అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన మొత్తం 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.