ADB: బోరజ్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద సిబ్బంది శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న 25 ఆవులు పట్టుబడగా పోలీస్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న SI గౌతమ్ ప్రకారం.. ఆవులను సంరక్షణ నిమిత్తం ఇచ్చోడలోని గోశాలకు తరలించినట్లు వెల్లడించారు. సంబంధిత డ్రైవర్ గురు రవాల్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.