NRPT: నారాయణపేట డిపో నుంచి కోయిలకొండ మీదుగా మహబూబ్ నగర్‌కు బస్సు సర్వీసును పునఃప్రారంభించాలని సీపీఎం నేతలు డిపో మేనేజర్ లావణ్యకు వినతిపత్రం అందజేశారు. గతంలో నడిచిన ఈ సర్వీసు నిలిచిపోవడం వల్ల పలు గ్రామాలకు ఇబ్బంది అవుతుందని, దీనిని పునరుద్ధరిస్తే సమయం ఆదా అవుతుందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం పేర్కొన్నారు.