WGL: 42% బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర బంద్ సందర్భంగా ఇవాళ WGLలోని పోచంమైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో కార్పొరేటర్ గుండేటే నరేందర్ అకస్మాత్తుగా కుప్పకూలారు. అక్కడే ఉన్న L.శ్రీనివాస్ త్వరితంగా స్పందించి, బస్వరాజు సారయ్య కారులో నరేందర్‌ను సంరక్ష హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం నరేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.