PDPL: జూలపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్ గుండెపోటుతో శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ఆయన స్వగ్రామమైన కాచాపూరులో శనివారం అంత్యక్రియలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అంత్యక్రియలకు హాజరై పాడే మోశారు.