SDPT: పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని గజ్వేల్ శ్రీ రామకోటి భక్తి సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు శనివారం అన్నారు. గజ్వేల్లో రేపు పద్మశాలి సంఘం అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆవాలతో తయారుచేసిన కుర్చీ గుర్తు పటాన్ని, పోటీలో ఉన్న అభ్యర్థి దేవదాసుకు అందజేసి ఆవిష్కరించారు. ఇందులో పద్మశాలి కుల బాంధవులు ఉన్నారు.