MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి నవంబర్ 7 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం కార్యనిర్వహణాధికారి మదనేశ్వర్ రెడ్డి జాతర ఏర్పాట్లపై మాట్లాడారు. నెల రోజులపాటు జరిగే జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, పార్కింగ్, వసతి, తదితర సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.