VZM: గజపతినగరం ఎమ్మెల్యే, MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శనివారం జర్మనీ పారిశ్రామిక వేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్లో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కీలక సమావేశం జరిగిందని, వివిధ కంపెనీలకు చెందిన 30 మంది CEO లతో పెట్టుబడుల సమావేశం నిర్వహించామని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు వివరించినట్లు తెలిపారు.