అన్నమయ్య: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు నియమాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని పోలీసులు సూచించారు .