KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో గల హజ్రత్ ఆశిక్ బాబా, సయ్యద్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్లారెడ్డి మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో దర్గా ఉర్సు నేటి నుంచి నిర్వహించనున్నట్లు అధ్య క్షుడు షేక్ గయాజుద్ధీన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ మీర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.