KDP: బి.కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడ MPPS స్కూల్ టీచర్ బొండిగల శ్రీనును గ్రామస్తుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు మేళతాలలతో ఊరేగింపు చేశారు. ఇలాంటి టీచర్ తమ గ్రామం నుంచి వెళ్తుంటే చాలా బాధగా ఉందని గ్రామస్తులు అన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. గ్రామస్తులతో మమేకమై విద్యార్థుల సంఖ్యను పెంచారని వారన్నారు.