GNTR: తెనాలి నియోజకవర్గంలో మెగా DSC-2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆదివారం అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెనాలి సుల్తానాబాద్‌లోని సాయిబాబా మందిరం ఫంక్షన్ హాలులో జరిగే కార్యక్రమానికి MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ హాజరై ఉద్యోగులను సత్కరిస్తారు. కూటమి ప్రభుత్వం 16 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం చారిత్రాత్మకమని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.