అన్నమయ్య: కురబలకోట మండలంలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తిని విష సర్పం కాటేసింది. శనివారం జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్కార్ తోపులో కాపురం ఉంటున్న కర్మద్ బాష (36) ఊరికి సమీపంలోని చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. చెట్లపొదల చాటుకు వెళ్లి చేపలు వేటాడుతుండగా అక్కడున్న విష సర్పం బాషా కలిపై కాటేసింది. దీంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.