NLR: జిల్లాలోని రేషన్ మాఫియాపై నుడా ఛైర్మన్ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్య నాయకులు స్పందించారు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమక్షంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డిలను వివరణ కోరేందుకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం పిలిపించినట్లు తెలిపారు.