SKLM: గార మండలం గొంటి పంచాయతీ పరిధిలోని దీపావళి గ్రామం పేరుకు ఆసక్తికరమైన చరిత్ర ఉంది. స్థానికుల ప్రకాకరం.. శతాబ్దాల క్రితం ఓ రాజు దీపావళి రోజున గుర్రంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్థులు ఆయనకు సహాయం చేసి ప్రాణాలు కాపాడారు. కృతజ్ఞతగా రాజు ఊరిపేరు అడగగా పేరు లేదని తెలుసుకుని, ఆ రోజు దీపావళి కావడంతో ‘దీపావళి’ అని గ్రామానికి పేరు పెట్టాడట.