RR: ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న దొంగను చందానగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నారాయణపేట జిల్లాకు చెందిన భీమేష్ ఇంట్లో దొంగతనాలు చేస్తూ అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్నాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని రెండు ద్విచక్ర వాహనాలు, 8 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.