CTR: పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యా శాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈవో వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి అని సూచించారు.