RR: కొత్తూరు మండలం గూడూరుకు చెందిన RMP వైద్యుడు అశోక్‌కు ఈనెల 13న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి 10 లక్షల రుణం ఇస్తానని చెప్పారు. అంగీకరించిన అశోక్‌కు మాయమాటలతో రూ.10వేలు పంపిస్తే రుణం మంజూరు అవుతుందని నమ్మించగా.. రూ.9,850 పంపించాడు. కొద్దిసేపటి తర్వాత రూ.45,866 పంపగా వ్యక్తి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.