MLG: తాడ్వాయి (M) గుత్తికోయగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం AICC అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం, స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చొరవతో ఏర్పాటైన కంటైనర్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను నిత్యం స్కూలుకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. గూడెంలో అవసరమైన సౌకర్యాలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.