MNCL: జిల్లా గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను కలెక్టర్ ఆదేశాల మేరకు లక్కీ డ్రా పద్ధతిన ఎంపిక చేసి భర్తీ చేయడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ప్రకటనలో తెలిపారు. గురుకుల బాలికల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు 74 సీట్లు ఖాళీగా ఉండగా 37 సీట్లను భర్తీ చేయడం జరిగిందని, బాలుర పాఠశాలలో 89 సీట్లకు 38సీట్లను భర్తీ చేశామని పేర్కొన్నారు.