E.G: కార్తీక మాసం సందర్భంగా పంచారామ పుణ్యక్షేత్రాలకు రాజమండ్రి డిపో నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె. మాధవ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ స్పెషల్ బస్సులు బయలుదేరి సోమవారం అమరావతి భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలను దర్శిస్తాయి. కాగా, భక్తులు ఆర్టీసీ వెబ్సైట్, యాప్ ద్వారా టికెట్లు పొందవచ్చని తెలిపారు.