ATP: ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీల్లో అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని దీపశ్రీ ప్రథమ బహుమతి సాధించింది. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతులమీదుగా పురస్కారం అందుకుంది. కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, అధ్యాపకులు దీపశ్రీని అభినందించారు.