SRPT: నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి అని తెలిపింది. నేడు ఉదయం 9 గంటల లోపు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.