HNK: జిల్లా కేంద్రంలోని KLN ఫంక్షన్ హాల్లో ఆదివారం(రేపు) ఉదయం 11 గంటలకు MRPS, MSP అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుందని MRPS జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ తెలిపారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారు. ఉమ్మడి జిల్లా MRPS నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.