WGL: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు చివరి రోజైన శనివారం సాయంత్రం దరఖాస్తులు భారీగా వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 వరకు సగం షాపులకు సింగిల్ డిజిట్ దరఖాస్తులే ఉండగా, రాత్రి 9 గంటల వరకు వరంగల్‌లో 2945, హనుమకొండలో 1767, భూపాలపల్లిలో 1055, మహబూబాబాద్‌లో 1000కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.