KDP: పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.