WGL: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ప్రకటించారు. శనివారం బీసీ బంద్, బ్యాంకుల బంద్ కారణంగా దరఖాస్తులు వేయలేకపోయామని ఉత్సాహకుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించారు. 23న జరగాల్సిన షాపుల డ్రా 27కి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.