SRCL: వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి ఆధ్వర్యంలో ఫోక్సో (POCSO) చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ ల మధ్య తేడాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సున్నితంగా వివరించారు. వారితో కలిసి భోజనం చేసి, అనుబంధాన్ని పెంచుకున్నారు.