CTR: జీడీ నెల్లూరులో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు పెద్ద కాల్వ పంచాయతీ ఎల్లమరాజు పల్లెలో ఇటీవల వర్షాలతో ఇల్లు కూలిపోయిన సంఘటనలో బాధితురాలైన కుమారికి ఆర్థిక సాయం అందజేస్తారని వెల్లడించారు. అనంతరం 11 గంటలకు పాఠశాల సమీపంలో ప్రజలతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.