TPT: వెంకటగిరి – నిడిగల్లు రైల్వే స్టేషన్ల మధ్యలో పెట్లూరు గ్రామ సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. వెంకటగిరి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.