MLG: జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని శనివారం సాయంత్రం జిల్లా న్యాయవాద సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ, సీనియర్ న్యాయాధికారి కన్నయ్యలాల్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు చిన్నారులతో కలిసి టపాకాయలు కాల్చి ముందస్తు దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.