HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 127కు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 94కు చేరింది. నామినేషన్లకు ఆదివారం, సోమవారం సెలవు దినాలు కావడంతో మంగళవారం ఒక్కరోజే గడువు ఉంది.