NTR: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిల్లకల్లు ICDS ప్రాజెక్టు CDPO ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేశ్వరరావు, లీగల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.